Monday, February 2, 2015

టాక్ టైం

(Poste  in Kavisangamam 3rd Jan 2014)

కాల్ లో ముళ్ళుంటాయి ఒకోసారి 
గుచ్చుకుని గుండెల్ని సలుపుతాయి 
మాటలే కదా అనుకుంటామా 
మంటలు పుట్టిస్తాయవి
కారు చౌకే కదా అని రింగ్ చేశావా ?
అధిక ప్రసంగాలకి ఆహుతవుతావు
అప్పుడప్పుడూ కాల్స్ మైండ్ ని బ్లాస్ట్ చేస్తాయి
మొబైల్ నుంచి మిస్సైల్స్ దూసుకొస్తాయి
కొందరు మాట్లాడాక సైకియాట్రిస్ట్ ను కలవాలి
కొన్ని ఫోన్లు పెట్టాక నిష్టూరాలు వెంటాడతాయి
మిస్ డ్ కాల్స్ మోసానికి బలికాకు
నీ చేత్తో నిన్నే చరిచే చమక్కులవి
వాగుడు విద్యుత్తై ప్రవహిస్తే
నీ మాట నీకే షాక్ కొట్టి కాల్చొచ్చు
టైం పాస్ కని గాల్లోకి గాసిప్ లొదలకు
టైం బాంబులై నిన్నే గోల్ చేస్తాయవి
విలువైన పలుకులు వ్యక్తిత్వపు మెరుపులు
వ్యర్ధపు మాటలు నీ రూపుకు చెరుపులు

No comments:

Post a Comment