Some of the rare clippings of veteran actress Jayasudha and others
collected by Gourilakshmi Alluri.
Friday, September 9, 2011
Sunday, May 1, 2011
గమ్యం దిశగా...
గమ్యం దిశగా...
- అల్లూరి గౌరీలక్ష్మి
ఆంధ్రభూమి ఉగాది పోటీలో తృతీయ బహుమతి రూ.2500 పొందిన కథ, May 1st, 2011 .
దిల్‌సుక్‌నగర్ సాయిబాబా మందిరం. ఉదయం పది గంటలు బాబాదర్శనానికి భక్తులు క్యూలో చేతులు జోడించి భక్తితో నిలబడ్డారు. రాంబాబు కూడా ఆనందంగా వరసలో నిలబడ్డాడు. అతను గత రాత్రి పెళ్ళికని హైదరాబాద్ వచ్చాడు పెళ్ళయిపోయింది. ఈ రాత్రికి తిరుగు ప్రయాణం. పక్కనే బాబాగుడి ఉందని తెలిసి వచ్చాడు.
ఎదురుగా బాబాని చూడగానే రాంబాబుకి ఎందుకో స్వర్ణ గుర్తుకొచ్చింది. తనని వదిలేసి వెళ్ళిపోయిన భార్యమీద అతనికెంత కోపం, బాధ ఉన్నా ఎక్కడో చిన్నగా ఇంకా ఆరాధనే. ఆమెకు తగ్గట్టుగా ఉండలేకపోయిన తన అశక్తత మీద అసహనం. స్వర్ణ హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటోందని రాంబాబుకి ఈమధ్యే తెలిసింది. భార్య ఇంగ్లీష్ లెక్చరర్‌తో వెళ్ళిపోవడం వెనక తన చేతకానితనం ప్రధాన కారణమన్న చేదు నిజం అతనికి తెలియకపోలేదు.
అయినా రాంబాబు ఇప్పటికీ అలాగే బలాదూరుగా తిరుగుతూ పండీ పండని పొలం చూసుకుంటూ, అప్పులు చేస్తూ, కష్టపడకుండా, ఒళ్ళు అలవకుండా అలాగే బండి నడిపిస్తున్నాడు.
పిల్లనిస్తామని కొంతమంది వెంటబడుతున్నా ఎందుకో రాంబాబు తటపటాయిస్తూనే ఉన్నాడు. స్వర్ణ తిరిగి వస్తుందేమో అన్న ఆశ ఇంకా ఉందతనికి. వస్తే తను స్వీకరించాలా వద్దా అని అతను అనేక రాత్రులు ఆలోచించాడు. ఎటూ తేల్చుకోలేకపోయాడు ఇప్పటికీ.
ఇంతలో అప్పుడే ఒక యువతి క్యూలో వచ్చి చేరడం చూశాడు రాంబాబు. ఆశ్చర్యంతో అతని కనుబొమలు ముడిపడ్డాయి. అరె... స్వర్ణ! భ్రమకాదుకదా. నిజంగా స్వర్ణే... తల అటూ, ఇటూ చురుగ్గా తిప్పుతూ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది. అదే ఉత్సాహం. అదే చైతన్యం. ఇంకా అందంగా కనబడుతోంది. రాంబాబు గుండె వేగంగా కొట్టుకుంది.
స్వర్ణ తప్పిపోదుకదా! బాబాదర్శనం ఎలా చేసుకున్నాడో తెలీదు. ఆమెతో మాట్లాడడమే ధ్యేయంగా ఒక్కంగలో ఆమెను చేరుకున్నాడు. ప్రసాదం తీసుకుని, చెప్పులు వేసుకుని చకచకా నడిచిపోతోంది. ‘స్వర్ణా...స్వర్ణా...’ పిలిచాడు రాంబాబు.
వెనక్కి తిరిగింది స్వర్ణ. ‘‘నేను స్వర్ణా!’’ అన్నాడు మళ్ళీ.
‘‘ఎలా ఉన్నారు? రాంబాబూ!’’ అంది స్వర్ణ.
‘‘నువ్విక్కడే ఉంటున్నావా? అదే గుడి దగ్గర?’’
‘‘అవును మీరు?’’ ఆశ్చర్యంగా చూసింది.
‘‘నేనో పెళ్ళికొచ్చానే్ల’’ అన్నాడు ఆమె పక్కనే నడుస్తూ.
‘‘ఇక్కడే లలితానగర్‌లో ఉంటున్నాను రండి’’ అంది దారి తీస్తూ.
నడుస్తున్న ఇద్దరి మనసుల్లో గతం కదలాడింది.
* * *
స్వర్ణ తల్లిదండ్రులు ఒక రైలు ప్రమాదంలో ఒకేసారి మరణించారు. అప్పటికి స్వర్ణకి పదేళ్ళు. స్వర్ణ మావయ్య భద్రయ్యకి ఆమె బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. అతను చిన్న వ్యవసాయదారుడు. అక్కా, బావలకున్న కాస్త ధనం తీసుకుని, స్వర్ణని చదివించి ఆమె పెళ్ళిచెయ్యలని నిర్ణయించుకున్నాడు. అత్త కూడా ఫరవాలేదు. ఆమెకున్న చిన్న పిల్లలని స్వర్ణ చక్కగా చూసేది. సాయంచేసేది.
స్వర్ణ చదువులో, ఆటపాటల్లో ఫస్టున ఉండేది. స్వర్ణ డిగ్రీలో చేరింది. డిగ్రీ పూర్తికాగానే పెళ్ళిసంబంధాలు చూడడం మొదలుపెట్టాలనుకున్నాడు భద్రయ్య. మూడో సంవత్సరం చదువుతుండగానే స్వర్ణ కాలేజీలో బి.య్యే. చదువుతున్న రాంబాబు స్వర్ణను చేసుకుంటానని కబురు చేశాడు.
రాంబాబుది పక్క ఊరే. ఒక్కడే కొడుకు. నాలుగెకరాల పొలం ఉంది. చూడడానికి బానే ఉన్నాడు. భద్రయ్య దంపతులు ఒప్పుకున్నారు. పరీక్షలు కాగానే పెళ్ళిచేస్తాం అనేశారు.
స్వర్ణకి బి.కాం. తర్వాత ఇంకా చదువుకోవాలనుంది. ‘‘మావయ్యా! నాకప్పుడే పెళ్ళొద్దు. ఉద్యోగం వచ్చాక చేసుకుంటాను’’ అంది అభ్యర్థనగా.
భద్రయ్యకి స్వర్ణని ఎక్కడికో పంపి చదివించడంపై పెద్ద ఆసక్తిలేదు. రేపేదన్నా అయితే మావయ్య వదిలేశాడంటారు. మర్యాదగా పెళ్ళిచేసేసి చేతులు కడుక్కోవడం మంచిదనిపించిందతనికి. ఇదే భావాన్ని మేనకోడలికి వివరించి చెప్పాడు. ‘‘నాక్కూడా పిల్లలు ఎదుగుతున్నారు. నీ బాధ్యత ముగించాలి కదమ్మా’’ అన్నాడు నెమ్మదిగా.
స్వర్ణకి తన పరిస్థితి అర్థమయింది. తను మారాంచేసి చదువుకోవడానికి తనకి తల్లిదండ్రులు లేరు. డిగ్రీ పూర్తిచేయడమే తన స్థితికి గొప్ప అదృష్టం అనుకుని ఊరుకుంది.
స్వర్ణకీ, రాంబాబుకీ పెళ్ళయ్యింది. రాంబాబులో కేవలం తనని పెళ్ళాడిన మగాడిగా తప్ప మరేవిధంగానూ గౌరవించదగ్గ అంశాలు స్వర్ణకి కనిపించలేదు. అయినా సరిపెట్టుకుంది. బి.కాం. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యింది స్వర్ణ. రాంబాబు పాస్ కాకపోగా, తనకి ఫస్టియర్, సెకండియర్ సబ్జెక్టులున్నాయన్నాడు.
అవాక్కయింది స్వర్ణ. నేను సాయంచేస్తాను. పరీక్షలు కట్టమంది. నేనింక చదవను అనేసి బైటికి వెళ్ళిపోయాడు రాంబాబు. తొలి దెబ్బకి విలవిల్లాడిపోయిందామె. తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ‘‘నేనుద్యోగం చేస్తాను. మన ఊరి కానె్వంట్లో క్లర్క్ పోస్ట్ ఉందట.’’ భర్తనడిగింది.
‘‘మనకి నాలుగెకరాల పొలం ఉంది. నువ్వుద్యోగం చెయ్యడం నాకిష్టంలేదు. నేను ఊర్లో తలెత్తుకు తిరగలేను’’అన్నాడు రాంబాబు.
‘‘ఆ పొలం పెద్ద ఆస్తా! నలుగురం బ్రతకాలి. సంసారం పెరుగుతుంది. పంటలు పండుతాయన్న గారంటీ లేదు. పోనీ ఆ ఉద్యోగం మీరడగండి’’ అంది స్వర్ణ ఆఖరి ఆశగా.
‘‘ఉద్యోగాలు చెయ్యడం నావల్లకాదు. అసలు కాలేజీక్కూడా నేను రోజూ వచ్చేవాడిని కాదు తెలుసా!’’ గర్వంగా అన్నాడు. స్నేహితులతో పేకాడుతూ, సినిమాలు చూస్తూ కులాసాగా తిరిగే అతను భార్య మాటల్ని వినిపించుకోలేదు. అతని తల్లీ, తండ్రీ కొడుకుపాటే పాడారు. హతాశురాలయింది స్వర్ణ. పెళ్ళిచేసుకుంటానని ముందుకు వచ్చి తన జీవితాన్ని రెక్కలు విరిచిన పక్షిలా చేశాడు రాంబాబు అనుకుందామె నిట్టూరుస్తూ.
ఆమె అలా నిరాశను ఊపిరిగా చేసుకుంటున్న టైమ్‌లో ఎదురింట్లోకి రాయ్‌పాల్ అనే ఇంగ్లీష్ లెక్చరర్ వచ్చాడు. అతను స్వర్ణ, రాంబాబు చదివిన కాలేజీలో పనిచేస్తున్నాడు. ఒకసారి అతన్ని కలిసి ‘‘ఎం.కాం. చదువుతాను అప్లికేషన్ కావాల’’ని అడిగింది స్వర్ణ. అతను కరస్పాండెన్స్ చెయ్యమని దరఖాస్త్ఫురాలు తెచ్చిచ్చాడు. ‘‘నువ్వింకా చదవడం నాకిష్టంలేదన్నా’’డు రాంబాబు. ‘‘నేను చదివితే మీకేం నష్టం?’’ అసహనంగా అంది స్వర్ణ. ‘‘నా ఇష్టప్రకారం లేని భార్య నాకొద్దన్నా’’డు రాంబాబు.
ఆ తర్వాత స్వర్ణ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత రాయ్‌పాల్ లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అతనితోపాటు స్వర్ణ వెళ్ళిపోయింది తన బట్టలు, పుస్తకాలూ తీసుకుని.
ఊరంతా గుప్పుమంది. రాంబాబు ఊహించని ఈ పరిణామానికి నిర్ఘాంతపోయాడు. ఆపై అవమానపడ్డాడు. తల్లీ, తండ్రీ చదువుకున్న పిల్లని చేసుకోవడం తప్పయిందన్నారు. మరో రెండుమూడు నెలలకి సంబాళించుకున్నాడు రాంబాబు. ఒకట్రెండుసార్లు ఆత్మపరిశీలన లాంటిది చేసుకోబోయాడు. మిత్రులు అతన్ని సమర్ధించి ఓదార్చారు. దాంతో నిదానించాడతను.
ఇదంతా జరిగి మూడేళ్ళయింది. రాంబాబుకి సంబంధాలు వస్తున్నాయి. అతనింకా మరో పెళ్ళికి ధైర్యం చెయ్యలేకపోతున్నాడు. స్వర్ణ హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటోందన్న వార్త రాంబాబుకు ఎందుకోగాని గొప్ప రిలీఫ్ ఇచ్చింది.
ఇద్దరూ ఆలోచిస్తూ నడుస్తుండగానే ఇల్లొచ్చింది. ‘‘ఇదే ఇల్లు రండి’’ అంది స్వర్ణ గేటుతీస్తూ. చిన్న కామన్ వరండాలో నాలుగు పోర్షన్లున్నాయి. తాళం తీసింది స్వర్ణ. రెండే గదులు. రెండు కుర్చీలు, సింగిల్ కాట్ ఉన్నాయి ముందు గదిలో.
మంచినీళ్ళిచ్చింది స్వర్ణ. వంటింట్లోకి వెళ్ళి స్వీట్, హాట్ తీసుకుని మళ్ళీ వచ్చింది. రాంబాబుకి కొంచెం టెన్షన్‌గా ఉన్నా అటూ ఇటూ చూస్తూ సర్దుకుంటున్నాడు. అల్మైరానిండా పుస్తకాలే. వాటిని చూడగానే భయం వేసిందతనికి, పరీక్షలు గుర్తొచ్చి.
రాంబాబుకి ఆమె పెట్టిన స్వీటూ, హాటూ తినాలనిపించలేదు. స్వర్ణ ఏం మాట్లాడుతుంది? తనేం మాట్లాడాలి? అని ఆలోచిస్తూ ఉన్నాడు. స్వర్ణని తీసుకొచ్చిన తను తప్పకుండా మోసంచేసే ఉంటాడు. అందుకే ఒంటరిగా ఉంది అనుకోగానే అతనికి కాస్త ఆత్మవిశ్వాసం కలిగింది.
మరిప్పుడు స్వర్ణ నన్ను క్షమించండి అంటే తనేం చెప్పాలి! అతనికి ఉద్విగ్నంగా ఉంది. మీతో వస్తానంటుందా! రాదులే! ఇక్కడ ఉద్యోగంచేస్తున్నట్టుంది కదా! పోనీ ననే్న రమ్మంటుందా! హైదరాబాద్ వస్తే గొప్పగానే ఉంటుంది కానీ తనిక్కడ ఏంచెయ్యగలడు! కష్టపడాలంటే తనవల్ల కాదు. తన భవిష్యత్ సస్పెన్స్ సినిమాలా ఉంది. అనుకున్నాడు.
ఇంతలో స్వర్ణ వేడి టీ తీసుకుని వచ్చింది ఇద్దరికీ. ఆమె తాగడం మొదలుపెట్టగానే తనూ తాగడం ప్రారంభించాడు రాంబాబు. ‘‘ఉద్యోగం ఏమిటి?’’ అన్నాడు అస్పష్టంగా. ‘‘ఒక ప్రైవేట్ ఫరమ్లో అకౌంట్స్ కమ్ ఎడ్మినిస్ట్రేషన్ వర్క్ చూస్తాను. జీతం బానే ఉంది. నేను ఎం.కాం. పాసయ్యాను’’ అంది స్వర్ణ నవ్వుతూ, రాంబాబు వైపు స్నేహంగా చూస్తూ.
‘‘అసలు నేను మళ్ళీ నిన్ను ఇలా కలుస్తాననుకోలేదు.’’ అన్నాడు రాంబాబు నవ్వుతెచ్చుకుంటూ.
‘‘నేను కూడా’’ అంది స్వర్ణ నవ్వేస్తూ.
‘‘కలిసినా మాట్లాడకూడదనుకున్నాను’’ అన్నాడు.
‘‘ఎందుకో!’’ అంది కళ్ళతో నవ్వుతూ.
‘‘ననె్నంత అవమానం పాలు చేశావు! ఏ భర్తయినా క్షమించగలడా!’’ ఉక్రోషంగా అన్నాడు.
‘‘ఆ అడుగు వెనక ఒక ఆడపిల్ల తీవ్ర ఆశాభంగం. ఆవేదనా ఉన్నాయనిపించలేదా?’’ స్వర్ణ నెమ్మదిగా అంది.
‘‘ఆవేశం, తొందరపాటూ ఉన్నాయనిపించింది’’ విసురుగా అన్నాడు.
‘‘మీ అసమర్థత అనిపించలేదా?’’
‘‘నేనేమన్నా తాగుబోతునా! పది మంది అమ్మాయిలతో తిరిగానా?’’
తననితాను చక్కగా సమర్ధించుకుంటున్న రాంబాబు వైపు విస్మయంగా చూసింది స్వర్ణ.
‘‘చూశావా! నువ్వు కూడా సమాధానం చెప్పలేకపోతున్నావు. నేను దుర్మార్గుణ్ణీ, భార్యను హింసించేవాడినీ అయితే లోకం హర్షించేది నువ్వు చేసిన పనికి.’’ ఆవేశంగా అన్నాడు.
ఆ భావజాలానికి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూండిపోయిందామె. ఆమె వౌనం చూసి రాంబాబుకి స్వర్ణపై ఆధిపత్యభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. అడగాల్సిన నాలుగు మాటలు అడిగి కడిగెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
‘‘నీకసలు అలా కట్టుకున్నవాడిని వదిలేసి వెళ్ళిపోవడం తప్పనిపించలేదా?’’ నిలదీశాడు రాంబాబు.
‘‘లోకానికి భయపడి నా జీవితాన్ని మీ వెనకే మగ్గించుకోవడం తప్పనిపించింది’’ అంది స్వర్ణ నిదానంగా. ‘‘నాకు నచ్చని బ్రతుకును బలవంతంగా ఈడ్చడం తప్పనిపించింది. తన్నుమాలిన ధర్మం ఉండదు కదా! అందుకే అలా చేశాను’’ అంది వివరంగా.
ఆమె మాటల్లోని అంతరార్ధాన్ని గమనించకుండా ‘‘నాకు ఊరందరిముందూ, చుట్టుపక్కల ముందూ తలకొట్టేసినట్టుగా అనిపించింది తెలుసా! తరవాత అంతా నన్ను ఆదరించార్లే. అందం, చదువు ఉన్నాయని నువ్వే విర్రవీగావన్నారు’’ చెప్పుకొచ్చాడు రాంబాబు.
‘‘తప్పంతా నాదేననీ, మిమ్మల్ని వదిలేసి పోవాల్సినంత దుర్మార్గులు మీరు కాదనీ అంతా తీర్మానించి ఉంటారు ఆడవాళ్ళతో సహా...’’ అంది స్వర్ణ నవ్వుతూ.
‘‘నీకెలా తెలుసు!’’ విసుగ్గా అన్నాడు రాంబాబు.
‘‘ఊహించాను.’’
‘‘ఇంటి గౌరవం మంట కలిపావు తెలుసా!’’
‘‘ముందు నాకు నేను ముఖ్యం. నా ఆత్మగౌరవం ముఖ్యం. నా జీవితాన్ని బలిపెట్టి రెండు కుటుంబాల గౌరవం కాపాడాలని నేను అనుకోలేదు’’ నిర్లిప్తంగా అంది.
‘‘ఇంతచేసి ఏం సాధించావు? ఆఖరికి మోసపోయావుకదా’’ కోపంగా, వెటకారంగా అన్నాడు.
‘‘నెన్నవరు మోసం చేశారు?’’ ఆశ్చర్యంగా అంది స్వర్ణ.
‘‘నిన్ను తీసుకొచ్చిన వ్యక్తి వదిలేసిపోలేదూ?’’
‘‘లేదు. అతనికి పెళ్ళయిందని నాకు తెలీదు. ఇక్కడికొచ్చాక తెలిసింది. అందుకే అతన్ని తిరస్కరించాను’’ అంది స్వర్ణ.
నిర్ఘాంతపోవడం రాంబాబు వంతయ్యింది. తేరుకుని ‘‘ఇలా జరిగిన దానికి నువ్వు...ఎంత?... ’’ అన్నాడు.
‘‘ఏ మాత్రమూ బాధపడట్లేదు’’ అంది.
‘‘పశ్చాత్తాపంతో కృంగిపోతూ బాధపడట్లేదంటావా?’’
‘‘పశ్చిత్తాపమా! నేనెందుకు పడతాను?’’ అంది విడ్డూరంగా చూస్తూ.
‘‘నిజం చెప్పు. నీకు నా దగ్గరికి వచ్చెయ్యాలని లేదూ!’’ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. పసిపిల్లాడి వైపు చూసినట్లుచూసింది స్వర్ణ రాంబాబువైపు.
‘‘ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిపోతాను. ఆలోచించి ఒక అడుగు ముందుకు వేశాకా, మరో ముందడుగు వేస్తాను. కానీ వెనకడుగు ఎందకు వేస్తాను?’’ స్వర్ణ ప్రశ్నకు రాంబాబు బిత్తరపోయాడు.
‘‘నేను చేసిన పనికి నేను గర్వపడుతున్నాను. నాలాంటి ఎందరో అభాగినులయిన ఆడ పిల్లలు చెయ్యలేని పని నేను చేసినందుకు తృప్తిగా ఉన్నాను.
‘‘ఆడ పిల్లల తల్లిదండ్రులకీ, మీలాంటి మగవారికీ, మీలాంటి వాళ్ళని గుడ్డిగా సమర్థించే ఆడవాళ్ళకీ ఒక్క క్షణం నేను గుర్తొస్తే అదే నేను చేసిన పనికి పరమార్థం అనుకుంటాను. ఆడపిల్ల చేతులు ముడుచుకుని, భర్త చాటున ఏడుస్తూ, విధిని తిట్టుకుంటూ చీకట్లో మగ్గిపోతూ ఉండదని... నాలా కూడా ఉంటుందనీ సమాజం అంతా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు.
నేనిప్పుడు సుఖంగా, ప్రశాంతంగా ఒక పరిపూర్ణ వ్యక్తిగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఆత్మవిశ్వాసంతో నా కళ్ళమీద నేను నిలబడ్డాను. నా గమ్యం నాకు తెలుసు. దానివైపు నేను ఆనందంగా నడుస్తున్నాను.’’
స్వర్ణ ఏమంటూందో ఇప్పుడు పూర్తిగా విన్న రాంబాబుకి ఆమె ఆలోచనా పరిధి ఎంత విస్తృతమయిందో తేటతెల్లమయ్యింది. తనెంత అమాయకంగా ఆమెముందు సంభాషణ చేస్తున్నాడో అర్థంకాగానే అతను ఒకసారిగా చిన్నబోయాడు. ఇంక అక్కడా కూర్చోలేకపోయాడు.
‘‘వస్తాను స్వర్ణా! ఆల్ ది బెస్ట్!’’ అంటూ లేచాడు. స్వర్ణకూడా లేచి నిలబడి ‘‘చాలా థాంక్స్! వచ్చినందుకు. మీక్కూడా విష్ యూ గుడ్‌లక్’’ అంది ఆత్మీయంగా.
ఆమెవైపు చూడకుండా రాంబాబు వడివడిగా బైటికి నడిచాడు. స్వర్ణ చూస్తూండగానే రాంబాబు నడుస్తూ, నడుస్తూ క్రమంగా కనుమరుగయ్యాడు. *
===
రచయత్రి పరిచయం
పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పాలెం. చదువు మలికిపురం డిగ్రీ కాలేజీలో. ఎపిఐఐసిలో పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా ఉద్యోగం. శ్రీమతి నర్సమ్మ, లక్ష్మీపతిరాజుగార్లు మా తల్లిదండ్రులు. రెండు దశాబ్దాలుగా సాహిత్య రంగంలో కృషి. 2 కథా సంపుటాలు, 2 నవలలు, ఒక కాలమ్స్ సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురణలు. స్నేహము, ఆర్ద్రత నిండిన మానవీయ రచనలు చేయాలని తపన. నా మినీ నవలను, మరో పది కథలను ప్రచురించి, ఇప్పుడీ కథకు బహుమతినిచ్చి ప్రోత్సహించిన ఆంధ్రభూమికి కృతజ్ఞతలు.
అల్లూరి గౌరీలక్ష్మి
99483 92357

Subscribe to:
Posts (Atom)