పరిష్కారం -అల్లూరి గౌరీలక్ష్మి, Andhra Bhoomi, January 30th,2010
‘‘ఏమయినా సరే! నేను మా ఊరెళ్ళిపోతాను’’ అంది బింకంగా మహాలక్ష్మి. ఓ గంట బ్రతిమాలాక లేచింది. ‘ఈ రాష్ట్ర విభజన కాదు కానీ మా దంపతుల విభజన జరిగేట్టుంది’ అనుకున్నాడు దేవేందర్ నిట్టూరుస్తూ. ఇలాంటివే చెదురుమదురు కోపతాపాలు నడుస్తుండగా మరో వారం గడిచింది. ఒక రోజు దేవేందర్ ఆఫీసునుంచి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.
ఉదయానే్న నిద్రలేచి మహాలక్ష్మి ముగ్గులు వేస్తోంది. పక్కనే ఖాళీ స్థలంలో స్పీకర్ మోగుతోంది. రాత్రికి రాత్రే షామియానా వేశారు. అటుగా పరుగుతీస్తున్న సాయినడిగింది ఏమిటి సంగతని.
‘‘మాకు కొత్త రాష్ట్రం వస్తందట. రాత్రి ఓమ్మినిష్టర్ చెప్పిండంట’’ అంటూ తుర్రుమన్నాడు. ముగ్గులేస్తూ మహాలక్ష్మి ఆలోచించింది. ఈ మధ్య గొడవలకి ముగింపొచ్చిందన్నమాట అనుకుంది. ఇంతలో పేపర్‌వాడు విసిరిన పేపర్ అటూ ఇటూ తప్పి హెడ్‌లైన్స్ చదివింది.
గబగబా గదిలోకి వెళ్ళి ముక్కు ఎగబీలుస్తూ పెట్టె సర్దుకోవడం మొదలుపెట్టింది. నిద్రపోతున్న దేవేందర్ లేచి ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమయింది! పెట్టె తీశావేం? మా అమ్మేమయినా అందా?’’ కంగారుగా అడిగాడు.
‘‘ఒకరనాలా? అంతా కలిసి ఆ చిదంబరం చేత చెప్పించారు కదా!’’ అంటూ మహాలక్ష్మి కళ్ళు తుడుచుకుంది.
‘‘చిదంబరమా! వాడెవడు?’’
‘‘పేపర్ చూడండి’’ అంది పేపర్ పడేస్తూ. రాత్రి చిదంబరం ప్రకటన దేవేందర్ వినే పడుకున్నాడు. అప్పటికి మహాలక్ష్మి నిద్రపోయింది.
‘‘ఓ అదా! నేను రాత్రే చూశానే్ల’’ అన్నాడు నవ్వేస్తూ.
‘‘అంటే ఇప్పుడు మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు కదా. ఇక నేనెందుకుండాలింక. మా ఊరు వెళ్ళిపోతాను’’ అంది కోపంగా.
‘‘్భలే ఉన్నావు. రెండు రాష్ట్రాలు వస్తే భార్యాభర్తలు విడిపోతారని ఎవరు చెప్పారు?’’ అన్నాడు మళ్ళీ నవ్వుతూ.
‘‘విడిపోనక్కరలేదని ఎవరు చెప్పారు?’’ పెట్టె మూస్తూ అంది.
‘‘అవసరం లేదే! నా మాట వినవే. ఈ సంగత్తెలిస్తే నా దోస్తులంతా నవ్వునవ్వి చస్తారు’’ అంటూ బ్రతిమాలాడు.
‘‘అందుకోసం నన్నుండమంటారా! అసలిలాంటి కుట్ర ఉన్నప్పుడు ననె్నందుకు పెళ్ళిచేసుకున్నారు?’’
‘‘ఇది కుట్ర కాదే! యాభయ్యారులో ఏం జరిగిందంటే’’ అంటూ అయిదు నిమిషాలు చాలా చాలా చెప్పాడు. ఏడో క్లాసుతో చదువాపేసిన మహాలక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. కానీ భర్త బిక్కమొహం చూసి పెట్టె మంచం కిందికి తోసింది.
రెండు రోజులు గడిచాయి. ఒక రోజు దేవేందర్ ఇంటికొచ్చేసరికి అతని గది తలుపులు బిగించి ఉన్నాయి. కొడుకుని చూస్తూనే తల్లి పరుగున వచ్చి చెవిలో చెప్పింది ‘‘నాన్నా, నేనూ టీవీ చూస్తుంటే పక్కనే కూర్చుని చూసింది. మొగమింత చేసుకుంది. సాయంకాలం కాంగానే తలుపేసుకుని సక్కగా పండుకుంది. లేపితే లేస్తలేదు. నేనేమనే్లదు’’.
అంతా విని ‘అబ్బ! ఈ టీవీ నా ప్రాణం తీస్తోంది’ అనుకున్నాడు.
‘‘పడుకున్నావేం లక్ష్మీ తలనొప్పా!’’ ప్రేమగా అడిగాడు భార్యని. మహాలక్ష్మి కిమ్మనలేదు. అడగ్గా అడగ్గా నోరు విప్పింది. ‘‘టీవీలో ఆ ప్రాంతం వాళ్ళంతా దొంగలు అని ఇంకా ఏదేదో అంటుంటే మీ నాన్న మీ అమ్మని పిలిచి చూపించి నవ్వుతున్నారు. మా నాన్న కట్నకానుకలు అన్నీ అనుకున్నట్టే ఇచ్చారు కదా! ఇంకా మావాళ్ళ మీద ఏడుపెందుకు? అసలు మీరు మీ ప్రాంతం వాళ్ళనే చేసుకుంటే పోయేదిగా’’ అంది కోపంగా.
‘‘నీకు తెలుసు కదా! మీ నాన్నగారి ఫ్రెండు మా నాన్నగారి ఫ్రెండు. ఆయన ఈ సంబంధం తెచ్చాడు. నువ్వేమో నాకు నచ్చావు. మరి తప్పలేదు’’ అన్నాడు సంజాయిషీగా.
‘‘ఏమయినా సరే! నేను మా ఊరెళ్ళిపోతాను’’ అంది బింకంగా మహాలక్ష్మి. ఓ గంట బ్రతిమాలాక లేచింది. ‘ఈ రాష్ట్ర విభజన కాదు కానీ మా దంపతుల విభజన జరిగేట్టుంది’ అనుకున్నాడు దేవేందర్ నిట్టూరుస్తూ.
ఇలాంటివే చెదురుమదురు కోపతాపాలు నడుస్తుండగా మరో వారం గడిచింది. ఒక రోజు దేవేందర్ ఆఫీసునుంచి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తల్లి ఆత్రంగా పరుగున కొడుకు దగ్గరికి వచ్చింది. ‘‘అమ్మాయి దోస్త్‌తానికి పోయింది. ఏం కష్టం వచ్చిందిరా నాయనా! ఇంట్లో ఏం మాట్లాడుకోకుండా అయింది. టీవీ పెట్టాలంటే బయమైంది. మీ నాయన కూడా అందరికీ చరిత్ర చెప్పుడు బంద్ చేసిండు. టీవీ పెట్టగానే మా ఇద్దరివంకా అనుమానంగా చూస్తది. ఆ పిల్లకి సముదాయించి చెప్పరాదురా! ఏదయితే అదయితది. ఈమెందుకుడుక్కుంటది నా కర్తమే కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. తండ్రి కూడా ‘అవున్రా బాబూ’ అన్నట్టు తలూపాడు.
‘‘సర్లే! ఆమెకు మనమంతా ఒక ప్రాంతం, ఆమెది మరో ప్రాంతం అనిపిస్తోంది ఈ టీవీ చూస్తుంటే. దోస్త్ దగ్గరికి పొయ్యింది కదా జర కూలయితదిలే’’ అన్నాడు దేవేందర్. కోడలు లేదు కదా అని తండ్రి టీవీ ఆనందంగా పెట్టి కూర్చున్నాడు. తల్లీ, కొడుకూ అటూ ఇటూ కూర్చున్నారు టీ తాగుతూ.
నవ్వుతూ వచ్చింది మహాలక్ష్మి. ఊపిరి పీల్చుకున్నాడు దేవేందర్. భార్య పక్కన చేరి ముచ్చట్లకు దిగాడు. అంతా కలిసి భోజనాలు చేశారు. ముద్దు ముచ్చట్లయ్యాక బాంబ్ పేల్చింది మహాలక్ష్మి. ‘‘ఇదిగో చెబుతున్నాను. మా ప్రాంతం వాళ్ళని మీ ముగ్గురిలో ఎవరయినా, ఏమయినా అన్నారంటే మీరు ముగ్గురూ నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కెళ్ళి కేసు పెట్టేస్తానంతే’’ అనేసి ముసుగు బిగించింది. ‘ఇదా, ఆ మిత్రాణి ఇచ్చిన సలహా!’ అనుకుంటూ తలపట్టుకున్నాడు. ఆమె నిద్రపోయింది. అతనికి నిద్ర రాలేదు.
ఇలా దినదినగండంగా దేవేందర్‌కి మరో పది రోజులు గడిచాయి. రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి తప్ప మెరుగుపడట్లేదనిపించిందతనికి.
టీవీ పెట్టగానే మహాలక్ష్మి వచ్చి కూచుంటోంది. వార్తా ఛానళ్ళు, చర్చలు చూసే మావగారు గతుక్కుమంటున్నారు. అత్తగారు సీరియల్ ఛానెల్‌కి మారుస్తోంది. మహాలక్ష్మి మొహం తేటపడుతోంది. అత్తాకోడలూ కలిసి వరసపెట్టి సీరియల్స్ చూసుకుంటున్నారు చర్చించుకుంటూ. దేవేందర్ తండ్రికి పిచ్చెక్కుతోంది వార్తలు చూడక. మిత్రుడింటికి పోయి తనివిరా మాట్లాడి టీవీ చూసి వస్తున్నాడు.
ప్రతిరోజూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి ముగ్గురినుంచీ రిపోర్టులు దేవేందర్‌కి అందుతున్నాయి. తండ్రేమో వార్తల సంగతి, అమ్మేమో మావా కోడళ్ళమధ్య నలుగుతున్న సంగతి, భార్యేమో అందరినీ అనుమానంగా చూస్తూ ఇచ్చే దమ్‌కీల సంగతి అన్నీ కలగలిసి అతనికి అత్యవసర నిర్ణయం తీసుకోవలసిన అవసరం పెంచాయి. చివరికి దేవేందర్ ఇద్దరు స్నేహితుల సలహాపై, టీమ్ లీడర్‌ని సహాయం అడిగి అనుకున్నది సాధించాడు. ‘అమ్మయ్య! ఇక సముద్రపుటొడ్డున సేదదీరాలి’ అనుకున్నాడు. ఇంటికొచ్చి తన నిర్ణయం చెప్పాడు. ముగ్గురూ అవాక్కయ్యారు.
దేవేందర్ తను పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఉన్న చెన్నై బ్రాంచ్‌కి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. మరో కొత్త ప్రాజెక్టు కోసం అతనక్కడ పనిచెయ్యాలి. ఈ సంగతి ముగ్గురికీ ఆనందంగా వివరించి చెప్పాడు.
‘‘ఇప్పుడెందుకురా! రాష్ట్రం సంగతి తేలాక వెళ్లు’’ అనునయించబోయాడు తండ్రి.
‘‘అది తేలేటప్పటికి నా కాపురం రెండు ముక్కలవుతుంది. అప్పుడు మీరో ముక్కలో మేమో ముక్కలో ఉండవలసి వస్తుంది’’ అన్నాడు విసుగ్గా, కోపంగా.
‘‘సర్లే నాయనా! నీవెట్లంటె అట్లా!’’ అని తన మద్దతు ప్రకటించింది తల్లి.
తన సమస్యకి ఇదెలా పరిష్కారమో మహాలక్ష్మికి అర్థం కాలేదు. అయినా వౌనం వహించింది భర్తపై నమ్మకంతో.
టీవీ ప్యాక్ చేసి పంపుతుంటే ‘‘ముందే చెన్నైకి పంపుతున్నావా?’’ అనడిగాడు తండ్రి. ‘‘కాదు. నా ఫ్రెండ్ ఇంట్లో పెట్టి మళ్ళీ నేనొచ్చినప్పుడు అవసరం అనిపిస్తే తెస్తా!’’ అన్నాడు దేవేందర్. తండ్రి గిలగిల్లాడాడు టీవీ వెళుతుంటే.
‘‘మరి నాకు అక్కడ కాలక్షేపం?’’ కినుకగా అన్నాడు కొడుకుతో.
‘‘మీకు బోర్ కొట్టకుండా మీ ముగ్గురికీ మంచి పుస్తకం కొన్నాను. ముగ్గురూ కలిసి చదువుకోవచ్చు’’.
‘‘ముగ్గురికీ ఒక పుస్తకమా!’’ అంది ఆశ్చర్యంగా మహాలక్ష్మి.
‘‘అవును’’ అంటూ కవర్‌లోంచి తీశాడు దేవేందర్. అది ‘ముప్ఫై రోజుల్లో తమిళ భాష’ పుస్తకం.

No comments:
Post a Comment